close

తాజా వార్తలు

Published : 14/04/2021 01:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మీ వాట్సాప్‌ ఖాతాను ఇలా కూడా హ్యాక్‌ చేస్తారు!

ఇంటర్నెట్‌డెస్క్‌: స్మార్ట్‌ ఫోన్‌ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరికీ వాట్సాప్‌ సుపరిచితమే. నిత్యం కొన్ని కోట్ల మంది వాట్సాప్‌ వేదికగా సమాచారాన్ని పంచుకుంటున్నారు. ఎన్‌క్రిప్ట్‌డ్‌ మెస్సెంజర్‌ అయినా అప్పుడప్పుడు భద్రతా లోపాలు బయటపడుతూనే ఉంటాయి. తాజాగా మరో లోపం బయటపడింది. వాట్సాప్‌లో మనం పంచుకునే వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల బారిన పడితే అంతే సంగతులు. ఈ విషయంలో సెలబ్రిటీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే, బయట పడిన భద్రత పరమైన లోపం ఏంటంటే.. మీరు వినియోగిస్తున్న వాట్సాప్‌ ఖాతాను మీకే తెలియకుండా తొలగించవచ్చు. అంతేకాదు, భవిష్యత్‌లో మళ్లీ ఆ ఖాతాతో సేవలు పొందకుండా కూడా చేయొచ్చు.

ఫోర్బ్స్‌కు చెందిన పరిశోధకులు లూయిస్‌ మార్జ్క్‌, ఎర్నస్టో కాన్లెస్‌లు ఈ విషయాన్ని గుర్తించారు. రెండు రకాలైన ధ్రువీకరణ (2ఎఫ్‌ఏ)కోడ్స్‌ను పలుమార్లు ఎంటర్‌ చేయడం ద్వారా  వాట్సాప్‌ ఖాతా శాశ్వతంగా మూతపడిపోయేలా చేశారు. దీంతో వాట్సాప్‌ ఆ ఖాతాను 12గంటల పాటు నిలిపివేస్తుంది. ఆ తర్వాత కొత్త మెయిల్‌ ఐడీ ద్వారా వాట్సాప్‌ సపోర్ట్‌ టీమ్‌కు సందేశం పంపి, ఖాతాకు సంబంధించిన నంబర్‌ పోవడం, చోరీకి గురైందని సమాచారాన్ని ఇచ్చి, ఆ వాట్సాప్‌ సేవలను శాశ్వతంగా నిలిపోయేలా చేశారు. వాట్సాప్‌ టీమ్‌ కూడా మరే ఇతర తనిఖీలు చేపట్టకుండా ఆ ఖాతాను డిలీట్‌ చేయటం గమనార్హం.

అయితే, ఇది వాస్తవంలో కాస్త శ్రమతో కూడుకున్న విషయమే. ఎందుకంటే 2ఎఫ్‌ఏ కోడ్స్‌ పొందాలంటే వాట్సాప్‌ నుంచి ధ్రువీకరించిన మొబైల్‌ నంబర్‌కు సందేశం వస్తుంది. అంటే హ్యాకర్లు ఎవరైనా ముందుగా మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీలను దొంగిలించాల్సి ఉంటుంది. మీకు తెలియకుండా మీ ఫోన్‌ను ఎవరైనా యాక్సిస్‌ చేస్తున్నట్లైతే ఈ తరహా హ్యాకింగ్‌ సాధ్యమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని