తెలంగాణలో వ్యాక్సిన్‌ డెలివరికి డ్రోన్స్‌

తాజా వార్తలు

Updated : 30/04/2021 17:31 IST

తెలంగాణలో వ్యాక్సిన్‌ డెలివరికి డ్రోన్స్‌

న్యూదిల్లీ: వ్యాక్సిన్ పంపిణీ కోసం ప్రయోగాత్మకంగా డ్రోన్ వినియోగానికి తెలంగాణ రాష్ట్రానికి అనుమతి లభించింది. ఈ మేరకు డీజీసీఏ(డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌)అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు ఈ అనుమతులు అమల్లో ఉంటాయి. అయితే, ఏ వ్యాక్సిన్‌ అన్నది మాత్రం డీజీసీఏ స్పష్టం చేయలేదు. పౌరుల ఇంటి వద్దకే హెల్త్‌కేర్ సేవలు అందించడం, సేవల పంపిణీ నేపథ్యంలో కొవిడ్-19 వ్యాప్తి చెందకుండా నియంత్రించడం దీని ప్రధాన ఉద్దేశం. చివరి మైలు వరకు ఆరోగ్య సేవలు అందించడం కూడా డ్రోన్ సేవల లక్ష్యం.

డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ల పంపిణీపై అధ్యయనం చేయాల్సిందిగా ఏప్రిల్‌ 22న ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. రాష్ట్రాల వద్ద కోటి వ్యాక్సిన్‌ డోసులు ఉన్నట్లు  చెబుతున్న ఆరోగ్యమంత్రిత్వశాఖ మరో మూడు రోజుల్లో 20 లక్షల డోస్‌లను అందించనున్నట్లు తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని