మూడు తలలతో శిశువు జననం!

తాజా వార్తలు

Published : 14/07/2021 01:19 IST

మూడు తలలతో శిశువు జననం!

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాలో అరుదైన సంఘటన జరిగింది. ఓ నవజాత శిశువు 3 తలలతో జన్మించింది. గులారియపుర్‌కు చెందిన రాగిణి సోమవారం ఈ చిన్నారికి జన్మ నిచ్చింది. దీంతో ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యేంతవరకు ఆమె ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉందని రాగిణి కుటుంబ సభ్యులు తెలిపారు. 

మూడు తలలతో శిశువు జన్మించడంతో వైద్యులతో పాటు కుటుంబ సభ్యులు విస్మయం చెందారు. ప్రస్తుతం తల్లీ బిడ్డా ఆరోగ్యంగా ఉండటంతో వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మూడు తలలతో బిడ్డ జన్మించిందని తెలుసుకున్న వారంతా ఆ శిశువును చూసేందుకు తరలివస్తున్నారు. కొంత మందైతే అది దేవుడి అవతారమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని