బద్వేలు వైకాపా ఎమ్మెల్యే కన్నుమూత
close

తాజా వార్తలు

Updated : 28/03/2021 11:16 IST

బద్వేలు వైకాపా ఎమ్మెల్యే కన్నుమూత

బద్వేలు : కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే డా.వెంకట సుబ్బయ్య(62) ఈ ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల హైదరాబాద్‌లో చికిత్స పొంది కడపలోని తన నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లోనూ పాల్గొన్నారు. మళ్లీ అనారోగ్యం బారిన పడిన ఎమ్మెల్యే కడపలోని అరుణాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య, ఇంటర్‌ చదువుతున్న కుమారుడు, ఎంబీబీఎస్‌ నాలుగో ఏడాది చదువుతున్న కుమార్తె ఉన్నారు.  ఎమ్మెల్యే మృతి పట్ల పలువురు వైకాపా నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.  

ఎమ్మెల్యే స్వస్థలం బద్వేలు పురపాలక సంఘం పరిధిలోని మల్లెలవారిపల్లి. వైద్య వృత్తిని చేపట్టాలని కర్నూలు మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ చేశారు. అనంతరం కామినేని, అపోలో ఆస్పత్రుల్లో కొంతకాలం పని చేశారు. ఈయన భార్య కూడా వైద్యురాలిగా ఉన్నారు. నియోజకవర్గ ప్రజల సందర్శనార్థం ఎమ్మెల్యే భౌతిక కాయాన్ని ఈ మధ్యాహ్నం బద్వేలు తరలించనున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని