హైదరాబాద్‌లో మరో 26 బస్తీ దవాఖానాలు

తాజా వార్తలు

Published : 11/08/2020 20:00 IST

హైదరాబాద్‌లో మరో 26 బస్తీ దవాఖానాలు

ఈనెల 14న ప్రారంభించనున్న కేటీఆర్‌, ఈటల

వెల్లడించిన మంత్రి తలసాని

హైదరాబాద్‌: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నెల 14న హైదరాబాద్‌ నగరంలో మరో 26 బస్తీ దవాఖానాలు ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. బస్తీ  దవాఖానాలపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ఈ బస్తీ దవాఖానాలను మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌ ప్రారంభిస్తారని చెప్పారు. బస్తీ దవాఖానాల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని మంత్రి తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 300 బస్తీ దవాఖానాల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఇప్పటికే 197 బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని