తెరుచుకున్న బెంగాల్‌ సఫారీ

తాజా వార్తలు

Updated : 13/08/2021 20:24 IST

తెరుచుకున్న బెంగాల్‌ సఫారీ

కోల్‌కతా: కరోనా మహమ్మారి దెబ్బకు ఇన్నాళ్లూ మూతబడిన పశ్చిమ బెంగాల్‌లోని సఫారీ పార్కును ఎట్టకేలకు తెరిచారు. పార్కుకు రావడానికి సందర్శకులకు అనుమతి ఇస్తున్నారు. దీంతో పాటు రాష్ట్రంలోని మరో 12  జూలాజికల్ పార్కులూ ప్రారంభమయ్యాయి. పార్కుల ప్రారంభం గురించి అటవీశాఖ గత వారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

‘‘మేము కొవిడ్‌ -19కు సంబంధించిన మార్గదర్శకాల ప్రకారం అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నాము. పార్కుల ప్రధాన ద్వారం వద్ద వాహనాలకు శానిటైజేషన్‌ చేయిస్తున్నాం. సందర్శకులు భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాం. పులులు, చిరుతల తదితర సఫారీలను తిరిగి ప్రారంభించాం. ఏనుగుల సఫారీ మాత్రం ప్రారంభించలేదు’’ అని బెంగాల్‌ సఫారీ పార్క్‌ డైరెక్టర్‌ దేవ్‌నాథ్‌ పేర్కొన్నారు.

దాదాపు ఆరు నెలల తర్వాత పార్కులు తిరిగి ప్రారంభం కావటంతో సందర్శకులు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బెంగాల్‌ సఫారీ పార్కును 2016లో సీఎం మమతా బెనర్జీ ప్రారంభించారు. దీని విస్తీర్ణం  దాదాపు 700 ఎకరాలకు పైగా ఉంటుంది. ఇక్కడ పులులు, ఏనుగులు, చిరుతలు, ఎలుగుబంట్లు తదితరాలకు చెందిన సఫారీలు ఉంటాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని