Covaxin: భారత్‌ బయోటెక్‌కు శుభవార్త
close

తాజా వార్తలు

Published : 18/06/2021 18:50 IST

Covaxin: భారత్‌ బయోటెక్‌కు శుభవార్త

దిల్లీ: తొలి స్వదేశీ టీకా కొవాగ్జిన్ తయారీదారు భారత్‌ బయోటెక్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుంచి శుభవార్త అందింది. కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగ లిస్టింగ్ (ఈయూఎల్‌)కు అనుమతించే పత్రాలు సమర్పించేందుకు అంగీకరించింది. ఈనెల 23న టీకా డేటా వివరాలు అందజేసేందుకు ఓ సమావేశం ఏర్పాటు చేసింది. ఇది కొవాగ్జిన్  టీకాపై పూర్తిస్థాయి సమీక్ష సమావేశం కాదని, వ్యాక్సిన్ మొత్తం డేటా సమర్పించేందుకు ఉద్దేశించిన భేటీగా డబ్ల్యూహెచ్‌ఓ వర్గాలు తెలిపాయి. కొవాగ్జిన్ అత్యవసర వినియోగ లిస్టింగ్‌కు డబ్ల్యూహెచ్‌ఓ నుంచి జులై లేదా సెప్టెంబర్‌లో అనుమతి లభించవచ్చని భారత్ బయోటెక్ గతనెలలో ప్రకటించింది.

డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాల ప్రకారం.. ఏదేని కొత్త లేదా లైసెన్స్‌ పొందని ఉత్పత్తిని ప్రజారోగ్య అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు అనుమతించే ప్రక్రియను ఈయూఎల్‌గా పరిగణిస్తారు. డబ్ల్యూహెచ్‌ఓ నుంచి దీనికోసం అనుమతి పొందేందుకు ఇప్పటికే 90 శాతం దస్త్రాలు సమర్పించినట్లు భారత్‌ బయోటెక్‌ గత నెలలో జరిగిన సమావేశంలో కేంద్రానికి వెల్లడించింది. మిగతా దస్త్రాలు జూన్‌లో సమర్పించనున్నట్లు తెలిపింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని