తెలంగాణ అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం

తాజా వార్తలు

Updated : 13/10/2020 12:43 IST

తెలంగాణ అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం

హైదరాబాద్‌: భాజపా, సీపీఐ, నిరుద్యోగుల అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. దీంతో శాసనసభ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల ఘటనల నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉన్నారు. అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తిని క్షణ్నంగా తనిఖీ చేస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ చట్టసవరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భాజపా, రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం చేపట్టాలంటూ సీపీఐ, ఉద్యోగ నోటిఫికేషన్ వెలువరించాలని డిమాండ్‌ చేస్తూ నిరుద్యోగులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. కొంత మంది భాజపా శ్రేణులు ఒక్కసారిగా అసెంబ్లీ వైపు దూసుకురావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా పోలీసులు, భాజపా శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసు వాహనాల్లో అక్కడి నుంచి తరలించారు. అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో పలువురు కీలక నేతలను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డి తదితరులను గృహనిర్బంధం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని