close

తాజా వార్తలు

Published : 11/04/2021 02:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎన్‌ఏఆర్‌ఎఫ్‌ బీఆర్‌కి సలహాదారుగా బీపీ ఆచార్య

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న జాతీయ స్థాయి ప్రాజెక్టు ఎన్ఏఆర్ఎఫ్ బీఆర్‌కి సలహాదారుగా విశ్రాంత ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యను ఐసీఎంఆర్‌ నియమించింది. ప్రీ క్లీనికల్ ఎనిమల్ ట్రయల్స్‌కు దోహదపడేలా నేషనల్ ఎనిమల్ రీసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ (ఎన్‌ఏఆర్‌ఎఫ్‌ బీఆర్‌) సంస్థను ఏర్పాటు చేయనున్నారు. శామీర్‌పేటలోని జీనోమ్‌ వ్యాలీలోని వంద ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు రానుంది. ఫార్మా, బయోఫార్మా, వ్యాక్సిన్ పరిశ్రమల ప్రీక్లినికల్ ఎనిమల్ ట్రయల్స్‌కు ప్రాజెక్టు ఉపయోగపడనుంది. జీనోమ్‌ వ్యాలీ అభివృద్ధి సమయంలో కీలకంగా వ్యవహరించిన బీపీ ఆచార్యను ఈ ప్రాజెక్టుకు సలహాదారుగా నియమిస్తూ ఐసీఎంఆర్‌ నిర్ణయం తీసుకుంది.


 

ఇవీ చదవండి


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని