నా ప్రియుడొస్తాడు.. తాళి కట్టొద్దు..

తాజా వార్తలు

Updated : 02/11/2020 04:51 IST

నా ప్రియుడొస్తాడు.. తాళి కట్టొద్దు..

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాళికట్టే శుభవేళ ఓ వధువు వరుడికి షాకిచ్చింది. తమిళనాడు నీల్‌గిరీస్‌లోని మట్టకండి గ్రామంలో జరిగిన ఈ ఘటన పెళ్లిమండపంలోని అందరినీ అశ్చర్యానికి గురిచేసింది. నా ప్రియుడు నా కోసం వస్తున్నాడని, ఈ పెళ్లి నాకొద్దంటూ వరుడు తాళికట్టే సమయంలో పేర్కొన్న వధువు అందరినీ విస్మయానికి గురిచేసింది. కరోనా నిబంధనల దృష్ట్యా కొద్దిమంది బంధువుల సమక్షంలో ఇరువురి కుటుంబసభ్యులు అక్టోబర్‌ 29న ముహూర్తం పెట్టుకున్నారు. అయితే చివరి నిమిషంలో వధువు తనకు ఈ పెళ్లి వద్దంటూ కుటుంబసభ్యులను, వరుడిని ఒప్పించే ప్రయత్నం చేసింది. తన ప్రియుడు వస్తున్నాడని చెప్పి పెళ్లి మండపం నుంచి లేచి వెళ్లిపోయింది. కూతురి ప్రేమను అర్థం చేసుకున్న తల్లిదండ్రులు వధువును ప్రియుడికి అప్పగించారు. అదే మండపంలో వధువును ప్రియుడికిచ్చి వివాహం జరిపించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని