obulapuram mining case: సబితా ఇంద్రారెడ్డి ప్రమేయంపై ఆధారాలున్నాయి: సీబీఐ

తాజా వార్తలు

Published : 27/07/2021 17:48 IST

obulapuram mining case: సబితా ఇంద్రారెడ్డి ప్రమేయంపై ఆధారాలున్నాయి: సీబీఐ

హైదరాబాద్‌: ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ అక్రమాల కేసులో అభియోగాల నమోదు, డిశ్ఛార్జి పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమయం కోరారు. కేసు నుంచి తనను తొలగించాలని కోరుతూ సబితా ఇంద్రారెడ్డి డిశ్ఛార్జి పిటిషన్‌ దాఖలు చేయగా.. ప్రస్తుత దశలో కేసు నుంచి తొలగించవద్దని, ఆమె ప్రమేయంపై ఆధారాలున్నాయని సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. డిశ్ఛార్జి పిటిషన్‌తోపాటు కేసులో అభియోగాల నమోదుపై వాదనలు వినిపించేందుకు సబిత సమయం కోరడంతో విచారణను సీబీఐ కోర్టు ఆగస్టు 2కి వాయిదా వేసింది. ఓఎంసీ కేసు నుంచి తొలగించాలని కోరుతూ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌పై కూడా విచారణను ఆగస్టు 2కి వాయిదా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని