భద్రాద్రి రాముడికి వైభవంగా మహాపట్టాభిషేకం
close

తాజా వార్తలు

Updated : 22/04/2021 14:46 IST

భద్రాద్రి రాముడికి వైభవంగా మహాపట్టాభిషేకం

భద్రాద్రి: శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ భద్రాద్రి శ్రీరాముడికి మహాపట్టాభిషేకం వేడుకను ఘనంగా నిర్వహించారు. నిత్యకల్యాణ మండపం వద్ద ఈ క్రతువును వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ చేశారు. కరోనా దృష్ట్యా భక్తులు లేకుండా వైదిక సిబ్బంది సమక్షంలో నిరాడంబరంగా మహాపట్టాభిషేకాన్ని జరిపారు. బంగారు కిరీటం, పాదుకలు, రాజదండంతో రామయ్యకు అలంకరణ చేశారు. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు రాత్రి 7 గంటలకు రజత రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఈ నెల 27 వరకు నిత్యకల్యాణాలు నిలిపేశారు. కొవిడ్‌ నిబంధనల్లో భాగంగా పూజలు, తీర్థ ప్రసాదాలను కూడా ఆపేశారు. 

తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న భద్రాచలంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. నిత్య కల్యాణ మండపం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో నిరాడంబరంగా ఈ వేడుక జరిపించారు. కరోనా నేపథ్యంలో భక్తులకు ప్రవేశం కల్పించలేదు. అర్చకులు, ఆలయ సిబ్బంది, కొద్దిమంది ప్రముఖుల సమక్షంలోనే క్రతువు నిర్వహించిన విషయం తెలిసిందే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని