హైదరాబాద్‌లో టీకా టెస్టింగ్‌ సెంటర్‌: కిషన్‌రెడ్డి

తాజా వార్తలు

Updated : 03/07/2021 12:52 IST

హైదరాబాద్‌లో టీకా టెస్టింగ్‌ సెంటర్‌: కిషన్‌రెడ్డి

 

దిల్లీ: నెల రోజుల్లో హైదరాబాద్‌లో వ్యాక్సిన్‌ టెస్టింగ్‌ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. పీఎం కేర్స్‌ నిధులతో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దేశంలో కేవలం రెండు వ్యాక్సిన్‌ టెస్టింగ్‌ కేంద్రాలే ఉన్నాయి. హైదరాబాద్‌లో మూడో వ్యాక్సిన్‌ సెంటర్‌ ఏర్పాటు కాబోతోంది. భాగ్యనగరం ఫార్మా, పరిశోధన సంస్థలకు కేంద్రంగా ఉంది. వ్యాక్సిన్‌ టెస్టింగ్‌ కేంద్రం రావడం హైదరాబాద్‌కు తలమానికం. టీకా టెస్టింగ్‌ సెంటర్‌కు అవకాశం కల్పించిన ప్రధానికి కృతజ్ఞతలు’’ అని కిషన్‌రెడ్డి అన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని