జగ్జీవన్‌రామ్‌కు చంద్రబాబు నివాళి

తాజా వార్తలు

Published : 05/04/2021 10:10 IST

జగ్జీవన్‌రామ్‌కు చంద్రబాబు నివాళి

అమరావతి: భారత మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నివాళులు ఆర్పించారు. జీవితమంతా సమసమాజ స్థాపన కోసం కృషిచేసిన మానవతావాది బాబూజీ అని కొనియాడారు. గాంధీజీ ఆయన్ను బాబు జగ్జీవన్ రామ్ అమూల్య రత్నగా పిలిచారని చంద్రబాబు గుర్తు చేశారు. సామాజిక వివక్ష, అసమానతలు లేని ప్రజాస్వామ్య సమాజ నిర్మాణం కోసం ఆయన కృషి చేశారన్నారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకొని బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి పోరాడదామని పిలుపునిచ్చారు. భారత స్వరాజ్య ఉద్యమంలోనూ, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా జగ్జీవన్ రామ్‌ భారత దేశ నిర్మాణంలోస్ఫూర్తి వంతమైన సేవలు అందించారని నారా లోకేశ్ అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని