భ్రమరాంబ, మల్లికార్జునస్వామి సేవలో సీజేఐ 
close

తాజా వార్తలు

Updated : 18/06/2021 16:41 IST

భ్రమరాంబ, మల్లికార్జునస్వామి సేవలో సీజేఐ 

సున్నిపెంట సర్కిల్: శ్రీశైలంలోని భ్రమరాంబ, మల్లిఖార్జున స్వామి వార్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయంలోని నంది నికేతన్‌ అతిథిగృహం వద్ద జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులకు ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, కర్నూలు జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌, ఆలయ ఈవో కేఎస్‌ రామారావు తదితరులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అర్చకులు పూర్ణకుంభం, వేద మంత్రోచ్ఛరణలతో ఆలయంలోకి ఆహ్వానించారు.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని