నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ బదిలీ

తాజా వార్తలు

Updated : 05/06/2021 16:32 IST

నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ బదిలీ

నెల్లూరు: నెల్లూరు జీజీహెచ్‌లో వైద్య విద్యార్థినికి ఉన్నతాధికారి లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ ముగిసింది. ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన రెండు కమిటీలు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నాయి. వాటి ఆధారంగా సదరు ఉన్నతాధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశముంది. విచారణలో డీఎంఈ త్రిసభ్య కమిటీ, జిల్లా స్థాయి త్రిసభ్య కమిటీలు బాధితురాలి నుంచి వివరాలు సేకరించాయి. నెల్లూరు జీజీహెచ్‌ మెడికోలు, వైద్యులను ఆరా తీశాయి. మరో వైపు రెండు కమిటీల నుంచి ప్రభుత్వానికి నివేదికలు అందకముందే నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభాకర్‌పై అధికారులు తాత్కాలిక చర్యలు తీసుకున్నారు. ప్రభాకర్‌ను తిరుపతి రుయాకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

నెల్లూరు జీజీహెచ్‌లో లైంగిక వేధింపుల ఆడియో రికార్డింగ్‌ టేపులు రాష్ట్రంలో సంచలనం గామారాయి. జీజీహెచ్‌లోని హౌస్‌ సర్జన్‌ను వైద్యాధికారి లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్టు సోషల్‌ మీడియా, వాట్సాప్‌ గ్రూపుల్లో హల్‌ చల్‌ కావడంతో దీనిపై ఇన్‌ఛార్జి కలెక్టర్‌ స్పందించి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని