పింగళికి భారతరత్న ఇవ్వాలని జగన్‌ లేఖ
close

తాజా వార్తలు

Updated : 12/03/2021 16:02 IST

పింగళికి భారతరత్న ఇవ్వాలని జగన్‌ లేఖ

అమరావతి: జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యకు భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాల్సిందిగా ప్రధాని మోదీని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. జాతీయ జెండాను రూపొందించి దేశ ప్రజల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిల్చిన పింగళికి భారత అత్యున్నత పురస్కారం ఇచ్చి గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య సంబరాలకు గుర్తుగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా పింగళికి భారతరత్న ప్రకటించటం సముచితమని భావిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. గతంలో కొందరికి మరణానంతరం భారతరత్న ఇచ్చారని.. పింగళి వెంకయ్య సేవలను ఇప్పటికైనా గుర్తించాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని