AP News: పంటల బీమా నిధులు విడుదల

తాజా వార్తలు

Published : 25/05/2021 12:32 IST

AP News: పంటల బీమా నిధులు విడుదల

అమరావతి: రైతు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు.  వైఎస్సార్‌ పంటల బీమా చెల్లింపు నిధులను సీఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు, లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన మాట్లాడారు. ఖరీఫ్‌ 2020 పంటల బీమాకు సంబంధించి రూ.1,820.23 కోట్ల నిధులను విడుదల చేసినట్లు సీఎం చెప్పారు. 

అన్నదాతలను ఆదుకునేందుకే ఉచిత పంటల బీమా నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు..  ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 15.15లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నట్లు సీఎం చెప్పారు. రైతులపై ఆర్థికభారం లేకుండా ప్రభుత్వమే బీమా మొత్తాన్ని భరిస్తోందన్నారు.  రైతు భరోసా కింద ఈనెలలోనే రూ.3,900 కోట్లు అందించామని  సీఎం గుర్తు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని