విధిగా 50శాతం బెడ్లు కేటాయించాలి: జగన్‌
close

తాజా వార్తలు

Updated : 06/05/2021 18:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విధిగా 50శాతం బెడ్లు కేటాయించాలి: జగన్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కొవిడ్‌ బాధితులకు తప్పనిసరిగా పడకలు కేటాయించాలని.. ఎంప్యానెల్‌ చేసిన ఆస్పత్రుల్లో విధిగా 50 శాతం బెడ్లు కరోనా బాధితులకు కేటాయించాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. అంత కంటే ఎక్కువ బాధితులు వచ్చినా తప్పనిసరిగా చేర్చుకోవాలన్నారు. ఈ మేరకు కొవిడ్‌ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై వైద్యారోగ్య శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. తాత్కాలిక ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లోనూ 50 శాతం పడకలు కేటాయించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్‌ ఎంప్యానెల్‌ ఆస్పత్రులూ కొవిడ్ రోగులకు పడకలు ఇవ్వాలని.. అందుకోసం ఆ ఆస్పత్రులను తాత్కాలికంగా ఎంప్యానెల్‌ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ బాధితులకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలన్నారు.కొవిడ్‌ ఆస్పత్రుల వద్దే కరోనా కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని వెల్లడించారు. 

తాత్కాలికంగా హ్యాంగర్లలో అన్ని వసతులతో కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని.. అవసరమైతే ఆస్పత్రుల వైద్యులే  కొవిడ్ కేర్ కేంద్రాల్లో సేవలందిస్తారని సీఎం స్పష్టం చేశారు. కరోనా ఆస్పత్రుల్లో నాణ్యమైన భోజనం, పరిశుభ్రత, ఆక్సిజన్, మెడికల్‌ కేర్, వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తూ అవసరం మేరకు ఆక్సిజన్‌ సరఫరా, నిల్వ కోసం చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం చేసే కేటాయింపులు సహా ప్రత్యామ్నాయ మార్గాలపైనా దృష్టి  సారించాలన్నారు. బోధన ఆస్పత్రుల వద్ద 10కేఎల్‌, ఇతర ఆస్పత్రుల వద్ద 1కేఎల్‌ సామర్థ్యం గల ఆక్సిజన్‌ నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు వీలైనంత త్వరగా ఆ ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని