కొవిడ్‌కు వ్యాక్సినేషనే పరిష్కారం: జగన్‌

తాజా వార్తలు

Published : 29/04/2021 18:39 IST

కొవిడ్‌కు వ్యాక్సినేషనే పరిష్కారం: జగన్‌

కరోనా వ్యాక్సినేషన్‌పై సీఎం సమీక్ష

అమరావతి: కొవిడ్‌కు వ్యాక్సినేషన్‌ మాత్రమే పరిష్కారమని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌పై ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. దేశంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి  సామర్థ్యం నెలకు ఏడు కోట్లు మాత్రమేనని.. 45 ఏళ్లకు పైబడిన వారు దేశవ్యాప్తంగా 26 కోట్ల మంది ఉన్నారన్నారు. వీరికి నాలుగు వారాల వ్యవధిలో రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆ మేరకు మొత్తం 52 కోట్ల వ్యాక్సిన్లు కావాలన్నారు. తొలి డోసు ఇప్పటివరకు కేవలం 12 కోట్ల మందికి మాత్రమే వేశారని.. రెండో డోసు 2.60 కోట్ల మందికి ఇచ్చారని చెప్పారు. మొత్తం కలిపి చూసినా ఇప్పటివరకు కొవిడ్ వ్యాక్సిన్‌ డోసులు 15 కోట్లు మాత్రమేనని వెల్లడించారు. ఇంకా 39 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు కావాల్సి ఉంటుందన్నారు.

భారత్‌ బయోటెక్‌ నెలకు కోటి వ్యాక్సిన్లు, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆరు కోట్ల టీకాలను తయారు చేస్తున్నాయని సీఎం వెల్లడించారు. ఇతర సంస్థల నుంచి టీకా రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందన్నారు. అన్నీ కలిపి ఆగస్టు నాటికి 20 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి కావొచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈ లెక్కన 39 కోట్ల డిమాండ్‌ ఆగస్టు లేదా సెప్టెంబర్‌ నాటికి పూర్తి కాదన్నారు. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు వారు దేశంలో 60 కోట్లు ఉన్నారని.. ఆ మేరకు వారికి రెండు డోసులకు కలిపి 120 కోట్ల టీకాలు కావాల్సి ఉంటుందన్నారు. 45 ఏళ్లకు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ ప్రక్రియ పూర్తయ్యాక 18 నుంచి 45 ఏళ్ల వారికి సెప్టెంబర్‌ నుంచి వ్యాక్సిన్‌ ఇవ్వొచ్చని అంచనాగా చెప్పారు. వారికి వ్యాక్సినేషన్‌ పూర్తి కావడానికి నాలుగు నెలల సమయం పడుతుందన్నారు. 2022 జనవరి చివరి నాటికి రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ చేయగలుగుతామని.. దాదాపు ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్నారు. అప్పటివరకూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. అందుకే శానిటేషన్‌ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని