close

తాజా వార్తలు

Published : 08/04/2021 18:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవిడ్‌ రోగులకు ఖర్చు లేకుండా చికిత్స: జగన్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాక్సినేషన్‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా అవసరాలకు సరిపడా డోసులను అందుబాటులో ఉంచుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖలో నాడు-నేడు కార్యక్రమంపై సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణ, నివారణ, సంసిద్ధతపై ప్రధానంగా చర్చించారు.  నిత్యం సగటున 1.4 లక్షల మందికి టీకాలను వేస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ప్రస్తుతం తగినన్ని డోసులు లేవని.. కేవలం రెండు రోజులకు సరిపడా నిల్వలే అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. స్పందించిన సీఎం.. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా సరిపడా టీకాలు వచ్చేలా చూడాలన్నారు. రోజుకు గ్రామీణ ప్రాంతాల్లో 4 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల మందికి టీకాలు వేయాలని ఆదేశించారు. కొవిడ్ చికిత్స పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీకి ఆస్కారం ఉండకూడదన్నారు. కొవిడ్‌ రోగులకు రూ.1 ఖర్చు లేకుండా చికిత్స అందించాలని స్పష్టం చేశారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని