అంగన్‌వాడీ ఉద్యోగులను తొలగించం: జగన్‌
close

తాజా వార్తలు

Updated : 17/06/2021 16:42 IST

అంగన్‌వాడీ ఉద్యోగులను తొలగించం: జగన్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నూతన విద్యా విధానం అమలుకు కార్యాచరణ చేపట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా శాఖ, నూతన విద్యా విధానం, అంగన్‌వాడీల్లో నాడు-నేడుపై సీఎం సమీక్షించారు. రెండేళ్లలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులు, ప్రస్తుత, భవిష్యత్‌ తరాలకు మేలు జరుగుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. నూతన విద్యా విధానంలో భాగంగా మండలానికి ఒకట్రెండు జూనియర్‌ కళాశాలలు ఉండేలా చూడాలని.. ఆట స్థలం లేని పాఠశాలలకు నాడు-నేడు కింద భూమి కొనుగోలు చేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి క్రీడా దుస్తులు, షూ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు. పాఠశాలలు, అంగన్‌వాడీల్లో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం లేదని.. ఒక్క కేంద్రాన్ని కూడా మూసివేయడం లేదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

రెండు రకాల పాఠశాలలు ఉండాలి..

రాష్ట్రంలో రెండు రకాల పాఠశాలలు ఉండాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు. పీపీ-1లో 1, 2 తరగతులకు కిలోమీటర్‌ లోపు పాఠశాల ఉండాలన్నారు. పీపీ-2లో 3-10 తరగతులకు 3 కిలోమీటర్లలోపు హైస్కూల్‌  పరిధిలోకి తీసుకురావాలన్నారు. ఒకే టీచర్‌ అన్ని పాఠ్యాంశాలు బోధించే విధానం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. జులై 1నుంచి రెండో దశ నాడు-నేడు ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని