ఇళ్ల నిర్మాణాలు ఆగకూడదు: జగన్‌
close

తాజా వార్తలు

Published : 06/05/2021 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇళ్ల నిర్మాణాలు ఆగకూడదు: జగన్‌

అమరావతి: జగనన్న కాలనీల్లో జూన్‌ 1వ తేదీ నుంచి పనులు ప్రారంభించాలని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 25 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు, జగనన్న కాలనీల్లో వసతుల కల్పన, టిడ్కో ఇళ్ల నిర్మాణంపై సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ నిర్మాణ పనులు ఆగకూడదని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల వరకు యథావిధిగా కార్యకలాపాలు కొనసాగేలా చర్యులు తీసుకోవాలని ఆదేశించారు.

ఇళ్ల నిర్మాణ పనుల్లో ఎక్కడా జాప్యం ఉండకూడదని.. కొవిడ్‌ వేళ ఇళ్ల నిర్మాణం మెరుగైన ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుందన్నారు. అంతేకాకుండా కరోనా వేళ నిర్మాణాలు చేపట్టడంతో కార్మికులకు పని దొరుకుతుందన్నారు. స్టీల్‌, సిమెంట్‌, ఇతర మెటీరియల్‌ కొనుగోలుతో వ్యాపార లావాదేవీలు సైతం కొనసాగుతాయని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో అంతా భూగర్భ కేబుల్‌ వ్యవస్థే ఉంటుందని.. నీటి పైపులు, విద్యుత్‌, ఇంటర్నెట్‌ కేబుళ్లన్నీ భూగర్భంలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ మేరకు అన్ని రకాల పనులకు డీపీఆర్‌ సిద్ధం చేసుకోవాలన్నారు. అంతేకాకుండా నిర్మాణ పనులను ఒకే ఏజెన్సీకి ఇవ్వాలన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని