AP News: 15న వాహనమిత్ర.. 22న చేయూత

తాజా వార్తలు

Published : 26/05/2021 16:37 IST

AP News: 15న వాహనమిత్ర.. 22న చేయూత

వచ్చేనెలలో పలు పథకాల అమలు
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ సమీక్ష

అమరావతి: వచ్చేనెల 17 నాటికి రాయితీ వేరుశెనగ విత్తనాల పంపిణీ పూర్తవ్వాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా జులై 8న రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకే) ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్పందన కార్యక్రమంపై సమీక్షలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉగాది నాటికి మధ్యతరగతి వారికి తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామని.. పట్టణాలు, నగరాల్లో 17 వేల ఎకరాలు అవసరమవుతున్నట్లు అంచనా వేశామన్నారు. వివిధ కేటగిరీల్లో ప్రభుత్వం, ప్రైవేట్‌ భూములను సేకరించినట్లు సీఎం వివరించారు.

కొత్తగా నిర్మించే వైద్య కళాశాలలకు ఈనెల 30న శంకుస్థాపన చేస్తామని.. 31న పశ్చిమగోదావరి జిల్లాలో అమూల్‌-ఏపీ పాల ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు సీఎం వెల్లడించారు. వచ్చే నెలలో అమలు చేయనున్న పథకాలను ఈ సందర్భంగా జగన్‌ ప్రకటించారు. వచ్చేనెల 8న జగనన్న తోడు, 15న వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర, 22న వైఎస్‌ఆర్‌ చేయూత పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. సామాజిక తనిఖీ తర్వాత గ్రామాల్లోని జాబితాల్లో మార్పులు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని