close

తాజా వార్తలు

Updated : 11/04/2021 12:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ స్వయం పాలనా: కేసీఆర్‌

హైదరాబాద్‌: బడుగు, బలహీనవర్గాల ఆర్థిక పురోగతికి దోహదపడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యాచరణ వెనక మహాత్మాజ్యోతిబాపూలే వంటి దార్శనికుల స్ఫూర్తి ఇమిడి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. రేపు పూలే 195వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం.. ఆయన సేవలను స్మరించుకున్నారు. ఆరేళ్ల తెలంగాణ స్వయం పాలనా పక్రియ పూలే వంటి మహనీయుల స్ఫూర్తితోనే కొనసాగుతోందన్నారు. కులవృత్తులకు సామాజిక, ఆర్థిక గౌరవాన్ని పెంపొందించేలా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. మహాత్మాజ్యోతిబాపూలే విదేశీ విద్యా నిధి పేరిట విదేశీ విద్యను ప్రభుత్వ ఖర్చుతో బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం అందిస్తోందని సీఎం గుర్తు చేశారు.



 

ఇవీ చదవండి


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని