KCR: వరంగల్‌ ఎంజీఎంను పరిశీలించిన కేసీఆర్‌

తాజా వార్తలు

Updated : 21/05/2021 13:32 IST

KCR: వరంగల్‌ ఎంజీఎంను పరిశీలించిన కేసీఆర్‌

వరంగల్‌: సీఎం కేసీఆర్‌ వరంగల్‌ చేరుకున్నారు. నగరంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల హెలిప్యాడ్ వద్ద మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్‌ సీఎంకు స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్‌ నేరుగా ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. కొవిడ్‌ బాధితులకు అందుతున్న వైద్యసేవలను ఆయన అడిగి తెలుసుకున్నారు. రోగులను పరామర్శించి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు.

ఆస్పత్రిలో పడకలు, ఆక్సిజన్‌, వెంటిలేటర్లు, రెమ్‌డెసివిర్, ఇతర మందుల లభ్యత తదితర అంశాలపై అధికారులతో సీఎం చర్చించనున్నారు. ఎంజీఎం పర్యటన అనంతరం వరంగల్‌ సెంట్రల్‌ జైలును ఆయన పరిశీలించనున్నారు. జైలు ప్రాంగణంలోని 73 ఎకరాల్లో కొత్త ఆస్పత్రి నిర్మాణంపై అధికారులతో కేసీఆర్‌ చర్చించనున్నారు. ఆ తర్వాత ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కరోనా కేసుల కట్టడికి చేపడుతున్న చర్యలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని