Corona విషయంలో అప్రమత్తంగా ఉండాలి: కేసీఆర్‌
close

తాజా వార్తలు

Published : 01/05/2021 16:16 IST

Corona విషయంలో అప్రమత్తంగా ఉండాలి: కేసీఆర్‌

హైదరాబాద్: తెలంగాణలో కరోనా చికిత్స, పడకలు, ఔషధాలు, ఆక్సిజన్, వ్యాక్సిన్ల విషయంలో ఎలాంటి సమస్యలు రాకూడదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని.. ప్రతిరోజూ మూడు సార్లు సమీక్షించి పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించాలని సీఎస్‌ను ఆదేశించారు. రెమ్‌డెసివర్ వంటి ఔషధాలు, ఆక్సిజన్, పడకలు, వ్యాక్సిన్ల లభ్యత విషయంలో ఎలాంటి లోపం జరగకూడదన్నారు. అనుక్షణం కరోనా పర్యవేక్షణకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిని సీఎం కేసీఆర్ నియమించారు. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి నుంచి బయటపడేయాని సీఎం సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని