పనులు పెండింగ్‌లో ఉండకూడదు: కేసీఆర్‌

తాజా వార్తలు

Updated : 26/06/2021 15:25 IST

పనులు పెండింగ్‌లో ఉండకూడదు: కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా జులై 1 నుంచి చేపట్టనున్న పల్లె ప్రగతి, హరితహారంపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. అమలు చేయనున్న కార్యక్రమాలపై చర్చించారు.  నిర్దేశించిన ఏ పనీ పెండింగ్‌లో ఉండేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్‌ శాఖకు ప్రభుత్వం బాగా సహకరిస్తోందని, అలాంటప్పుడు పనులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో సమీక్షించుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇచ్చి నాటించాలని చెప్పారు. ఎన్నడూ లేని విధంగా పంటలతో రాష్ట్రం ధాన్యాగారంగా మారిందని, తక్షణమే అదనపు రైస్‌ మిల్లుల అవసరం ఏర్పడిందని అన్నారు.

‘‘ రాష్ట్రంలో రైస్‌ మిల్లుల సంఖ్య పెంచాలి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. 250 ఎకరాల్లో ఒక్కో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెజ్‌ ఏర్పాటు చేయాలి. సెజ్‌ల చుట్టూ బఫర్‌ జోన్లు ఏర్పాటు చేయాలి. వీటి పరిధిలో లేఔట్లు, నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దు.’’ అని కేసీఆర్‌ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కల్తీ విత్తనాల అమ్మకాల పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయ శాఖ, పోలీసులు సంయుక్తంగా కల్తీ విత్తనాలను అరికట్టాలన్నారు. కలెక్టర్లు, జిల్లాల ఉన్నతాధికారులు విశేష అధికారాలను ఉపయోగించుకోవాలని చెప్పారు. గ్రామాల్లో విద్యుత్‌ సమస్య పరిష్కారానికి పవర్‌ డే పాటించాలని కోరారు. ప్రజలను చైతన్యపరిచి శ్రమదానంలో పాల్గొనేలా చేయాలన్నారు. ప్రజా అవసరాలకు కేటాయించిన భూములను పంచాయతీలు, మున్సిపాలిటీల పేర్లపై రిజిస్ట్రేషన్‌ చేయాలన్నారు. పోడుభూముల సమస్య పరిష్కారానికి సమగ్ర నివేదిక తయారు చేయాలన్నారు. రికార్డుల్లో ఉన్న 66 లక్షల ఎకరాల అటవీభూముల హద్దులు గుర్తించాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం భోజన విమరామం తర్వాత పట్టణ ప్రగతిపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలోని 32 జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని