KCR: పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం సమీక్ష
close

తాజా వార్తలు

Updated : 13/06/2021 14:01 IST

KCR: పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌: అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు(డీపీవో)తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. పల్లె, పట్టణ ప్రగతిపై కార్యక్రమంపై ఆయన కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చే ఈ కార్యక్రమానికి ఆర్థిక సంఘంతో పాటు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు జరిపి ప్రతినెలా నిధులను విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా అమలు తీరుపై సీఎం సమీక్షిస్తున్నారు. జిల్లాల వారీగా కార్యక్రమాల అమలు, పనుల పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. కార్యక్రమాల తదుపరి లక్ష్యాలపై సీఎం కేసీఆర్‌ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని