Ts news: వరంగల్‌లో సీఎం కేసీఆర్‌ పర్యటన
close

తాజా వార్తలు

Updated : 21/06/2021 15:24 IST

Ts news: వరంగల్‌లో సీఎం కేసీఆర్‌ పర్యటన

వరంగల్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరంగల్‌ నగరంలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేపడుతున్నారు. ఉదయం హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో హన్మకొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలకు చేరుకున్న సీఎంకు.. మంత్రులు ఎర్రబెల్లిదయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మేయర్ గుండు సుధారాణి, ఇతర ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు.

సెంట్రల్‌ జైలు మైదానంలో 24 అంతస్తులతో నిర్మించనున్న మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం కాళోజీ ఆరోగ్య వర్సిటీ నూతన భవనాన్ని సీఎం ప్రారంభించారు. ఐదెకరాల విస్తీర్ణంలో రూ.25 కోట్లతో ఈ భవన నిర్మాణాన్ని చేపట్టారు. హన్మకొండలోని వరంగల్‌ అర్బన్‌ జిల్లా సమీకృత కలెక్టర్‌ భవన సముదాయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఎక్సైజ్‌కాలనీలోని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నివాసంలో భోజనం చేయనున్నారు. ఆతర్వాత ఆర్ట్స్‌ కళాశాల నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు సీఎం వెళ్లనున్నారు.ఔ

వరంగల్‌ కేంద్ర కారాగార మైదానంలో మల్లీ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మొత్తం 60 ఎకరాల విస్తీర్ణంలో 24 అంతస్తుల్లో ఆస్పత్రి నిర్మాణం చేపట్టనున్నారు. 2 వేల పడకల సామర్థ్యంతో, 35 సూపర్‌స్పెషాలిటీ విభాగాలతో ఆస్పత్రిని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 24 అంతస్తుల భవనంపై హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేయనున్నారు. వైద్య విద్యార్థుల కోసం సెమినార్‌ హాళ్లు, ఆడిటోరియం, రోగుల సహాయకుల కొరకు 100 ప్రత్యేక గదులు నిర్మించనున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని