TS News: ఈటల కుమారుడిపై కేసీఆర్‌కు ఫిర్యాదు

తాజా వార్తలు

Updated : 23/05/2021 12:29 IST

TS News: ఈటల కుమారుడిపై కేసీఆర్‌కు ఫిర్యాదు

విచారణకు ఆదేశించిన సీఎం

హైదరాబాద్‌: తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుమారుడు నితిన్‌రెడ్డిపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు అందింది. తన భూమిని నితిన్‌ కబ్జా చేశారంటూ మేడ్చల్‌ మండలం రావల్‌కోల్ వాసి మహేశ్‌ ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ సీఎంకు విన్నవించుకున్నారు. మహేశ్‌ ఫిర్యాదు నేపథ్యంలో ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ ప్రారంభించాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) విజిలెన్స్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. 

మెదక్‌ జిల్లా అచ్చంపేట, హకీంపేటలో భూకబ్జాకు పాల్పడ్డారనే ఆరోపణలు, ప్రభుత్వ విచారణ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇటీవల ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి తొలగించారు. తాజాగా ఈటల కుమారుడు నితిన్‌రెడ్డిపై భూకబ్జా ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు అందడంతో సీఎం విచారణకు ఆదేశించారు.  

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని