తెలంగాణలో కొత్తగా 3,052 కరోనా కేసులు
close

తాజా వార్తలు

Updated : 13/04/2021 12:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో కొత్తగా 3,052 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,13,007 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 3,052 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఏడుగురు మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,772కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 778 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,06,678కి చేరింది. ప్రస్తుతం 24,131 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 16,118 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 406 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,11,81,010కి చేరింది. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని