close

తాజా వార్తలు

Updated : 16/04/2021 10:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలంగాణలో 3,840 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. నిన్న రాత్రి 8గంటల వరకు 1,21,880 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 3,840 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత ఇవే అత్యధిక కేసులు. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 9 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,797కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1198 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,09,594కి చేరింది. ప్రస్తుతం 30,494 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 20,215 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 505 కేసులు నమోదయ్యాయి. 




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని