Covid: ఏపీలో 13వేలు దాటిన మరణాలు

తాజా వార్తలు

Published : 11/07/2021 18:09 IST

Covid: ఏపీలో 13వేలు దాటిన మరణాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మృతుల సంఖ్య 13వేలు దాటింది. గడిచిన ఒక్కరోజు వ్యవధిలో 16 మంది బాధితులు కొవిడ్‌ బారినపడి మృతి చెందడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 13,002కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 91,677 పరీక్షలు నిర్వహించగా.. 2,665 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,22,843 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో 3,231 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,81,161కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 28,680 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,29,86,288 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని