కాస్తంత ఊరట..

తాజా వార్తలు

Published : 04/08/2021 06:13 IST

కాస్తంత ఊరట..

తగ్గిన రోజువారీ కొవిడ్‌ కేసులు

దిల్లీ: దేశంలో కొత్తగా నమోదైన కొవిడ్‌ కేసుల సంఖ్య మంగళవారం తగ్గింది. గత 6 రోజులుగా పెరుగుతూ వస్తున్న క్రియాశీలక కేసుల సంఖ్య కూడా తగ్గడం కొంత ఊరటనిస్తోంది. క్రితం రోజుతో పోలిస్తే రోజువారీ పాజిటివిటీ రేటు కూడా తగ్గింది. గత 24 గంటల్లో 30,549 కొత్త కేసులు బయటపడగా.. 422 మంది కొవిడ్‌తో మృతి చెందారు. దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,17,26,507కి పెరగ్గా మహమ్మారి బారినపడి ఇంతవరకు 4,25,195 మంది ప్రాణాలు కోల్పోయారు.


* ఒక్క రోజులో 38,887 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. 6 రోజుల తర్వాత.. కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో క్రియాశీలక కేసుల సంఖ్య 4,04,958 (1.28%)కి తగ్గింది. ఇంతవరకు 3,08,96,354 మంది కొవిడ్‌ను జయించారు. రికవరీ రేటు 97.38%కి పెరిగింది.


* గత 24 గంటల్లో.. మహారాష్ట్రలో 118 మంది కొవిడ్‌తో మృతి చెందారు. కేరళ (90), ఒడిశా (67) మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ రోజువారీ మరణాల సంఖ్య 30లోపే నమోదైంది. 15 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కొవిడ్‌ మరణమూ నమోదు కాలేదు. మరో 11 రాష్ట్రాల్లో మరణాల సంఖ్య ఒక అంకెకే పరిమితమయింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని