బెంగళూరులో వేగంగా కరోనా ఉత్పరివర్తన

తాజా వార్తలు

Updated : 07/03/2021 05:16 IST

బెంగళూరులో వేగంగా కరోనా ఉత్పరివర్తన

దేశ సగటు కంటే ఎక్కువన్న పరిశోధకులు

దిల్లీ: జాతీయ కరోనా ఉత్పరివర్తన సగటు రేటుతో పోల్చుకుంటే బెంగళూరులో మ్యుటేషన్ల రేటు ఎక్కువగా ఉందని తేలింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్సీ) నిర్వహించిన ఓ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ప్రొటీమ్‌ రీసెర్చ్‌ జర్నల్‌లో ఈ పరిశోధన ప్రచురితమైంది. బెంగళూరులో 27 మ్యుటేషన్లను గుర్తించగా.. ఒక్కో శాంపిల్‌కు సగటున 11 ఉత్పరివర్తనాలు గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. జాతీయ ఉత్పరివర్తనాల సగటు రేటు (8.4), ప్రపంచ సగటు (7.3) కంటే ఇది ఎక్కువ అని పేర్కొన్నారు.

బెంగళూరు నగరంలో కరోనా సోకిన వ్యక్తుల ముక్కు నుంచి నమూనాలను సేకరించి పరీక్షించామని పరిశోధకులు తెలిపారు. వాటికి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేసి ఏ విధంగా ఉత్పరివర్తనం చెందుతున్నాయో గమనించామన్నారు. వాటిల్లో రోగనిరోధక శక్తిని క్షీణింపజేసే కణాలతో పాటు ఇంతకు ముందెన్నడూ గుర్తించని 13 వేర్వేరు ప్రొటీన్‌ కణాలను గుర్తించినట్లు వారు వెల్లడించారు. ఈ పరిశోధన కోసం నెక్స్‌ జనరేషన్‌ సీక్వెన్సింగ్‌ (ఎన్‌జీఎస్‌) విధానాన్ని వినియోగించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ విధానం ద్వారా కరోనా వైరస్‌లో ఎప్పటికప్పుడు వచ్చే మార్పుల్ని గుర్తించే వీలుంటుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఉత్పల్‌ తాతు తెలిపారు. వైరస్‌లో వచ్చే ఈ మార్పుల్ని ఎప్పటికప్పుడు గమనించడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని