Offbeat: ఈ ఐస్‌క్రీం ధర ₹60 వేలు.. ఇంతకీ ఏంటో దీని స్పెషల్‌!
close

తాజా వార్తలు

Published : 22/07/2021 16:12 IST

Offbeat: ఈ ఐస్‌క్రీం ధర ₹60 వేలు.. ఇంతకీ ఏంటో దీని స్పెషల్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: 10 గ్రాముల బంగారం ధర సుమారుగా రూ. 50వేలు. అదే బంగారంతో చేసిన ఒక్క ఐస్ క్రీమ్ ధర రూ.60వేలు. బంగారంతో ఐస్ క్రీమా? అదీ 60వేల రూపాయలా..! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. దుబాయ్‌లోని ఓ కెఫేలో దీన్ని విక్రయిస్తుండగా.. బాలీవుడ్‌ నటి షెషనాజ్‌ ట్రెజరీ దుబాయ్‌ వెళ్లి మరీ దాన్ని ఆరగించారు.

దుబాయ్‌లోని జుమీరా రోడ్‌లోని ‘స్కూపీ కెఫే’ ఈ ఖరీదైన ఐస్ క్రీమ్‌ను విక్రయిస్తోంది. బంగారం సహా, అనేక విలువైన పదార్థాలతో తయారుకావడమే ఈ ధరకు కారణం. 23 క్యారెట్ల బంగారం, తాజా వెనిల్లా గింజలు, కుంకుమ పువ్వు వంటివి దీనిలో కలిపారు. బాలీవుడ్‌ నటి షెహనాజ్‌ ట్రెజరీ దుబాయ్‌కి వెళ్లి మరీ ఈ ఐస్ క్రీమ్‌ను రుచి చూశారు. రూ.60వేల ఐస్ క్రీమ్ తింటున్న వీడియోను షెహనాజ్‌ ట్రెజరీ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేశారు. అయితే ఆ ఐస్‌క్రీమ్‌ను కొనలేదనీ, కెఫే వాళ్లు ఉచితంగా ఇచ్చారనీ షెహనాజ్‌ తెలిపారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని