close

తాజా వార్తలు

Published : 08/04/2021 20:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవిడ్ ఉద్ధృతి.. బేగం బజార్‌లో షాపుల మూసివేత!‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. కొత్తగా నమోదైన కేసుల సంఖ్య రెండువేలు దాటింది. అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో 398 కేసులు, మేడ్చల్‌-మల్కాజ్‌గిరిలో 214, రంగారెడ్డి జిల్లాలో 174 కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం లాక్‌డౌన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోని తరుణంలో హైదరాబాద్‌ కిరాణా మర్చంట్స్ అసోసియేషన్‌ స్వచ్ఛందంగా ఏప్రిల్‌ 9 నుంచి షాపులను పరిమిత వేళల్లోనే తెరుస్తామని‌ ప్రకటించింది. నిత్యావసర సరకుల నుంచి బంగారం వంటి ఖరీదైన వస్తువులు హోల్‌సేల్‌ ధరకు లభించే బేగంబజార్‌లో ఆ రోజు నుంచి ఉదయం 9  నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయి. ఇక్కడ గతంలో కూడా కరోనా కేసుల సంఖ్య పెరిగినప్పుడు వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. 

రాష్ట్రంలో బుధవారం 87,332 కరోనా టెస్టులు చేయగా 2,055 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ ఏడాదిలో రెండు వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.  గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్‌ వల్ల ఏడుగురు మరణించారు. దాంతో మరణాల సంఖ్య 1,741కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,362 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని