పాఠశాలలపై కరోనా పంజా

తాజా వార్తలు

Updated : 20/03/2021 19:26 IST

పాఠశాలలపై కరోనా పంజా

ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలపై కరోనా కోరలు చాస్తోంది. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కొవిడ్‌ బారిన పడుతున్నారు. వివిధ జిల్లాల్లోని విద్యాకేంద్రాల్లో మూడు రోజుల వ్యవధిలో వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. తాజాగా ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్దమండవ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని 11 విద్యార్థులు కరోనా బారినపడ్డారు. పాఠశాలలోని 88 మంది విద్యార్థులకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా వారిలో 11 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది. వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిర్మల్‌ జిల్లా ముథోల్‌లోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో 9 మంది విద్యార్థులకు వైరస్‌ సోకింది. కరోనా వ్యాప్తితో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహిస్తున్న వేళ కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. నాగర్‌కర్నూల్‌ పురపాలక పరిధిలోని ఉయ్యాలవాడ జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది. శనివారం మరో 12 మందికి వ్యాధి నిర్ధరణ అయ్యింది. దీంతో పాఠశాలలో మొత్తం బాధితుల సంఖ్య 16కు చేరింది. శుక్రవారం 83 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి వైరస్‌ సోకినట్లు తేలింది. శనివారం 300 మందికి పరీక్షలు చేయగా 12 మందికి పాజిటివ్‌గా తేలింది. వైరస్‌ను అరికట్టేందుకు పాఠశాలలో శానిటైజేషన్‌ చర్యలు చేపట్టారు. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసి చికిత్స అందిస్తున్నారు. తమ్మాజిపేట ప్రభుత్వోన్నత పాఠశాలలోనూ ఓ ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్‌గా తేలగా తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని