
తాజా వార్తలు
జగిత్యాల: మల్యాలలో భారీగా కరోనా కేసులు
మల్యాల: జగిత్యాల జిల్లా మల్యాల ఎస్సీ కాలనీలో కరోనా కలకలం రేగింది. కాలనీలోని 70 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 40 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మరింత మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారం క్రితం కాలనీ వాసులు బోనాల్లో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొనే సమయంలో చాలా మంది భౌతిక దూరం పాటించకపోవడంతో పాటు మాస్కులు కూడా ధరించలేదు. ఈ కారణంగానే పాజిటివ్ కేసులు పెరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రత్యేక బృందాలు కాలనీలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయి.
ఇవీ చదవండి
Tags :