Corona: Vijayawada,Ongoleలో దయనీయ పరిస్థితి
close

తాజా వార్తలు

Updated : 24/04/2021 21:58 IST

Corona: Vijayawada,Ongoleలో దయనీయ పరిస్థితి

ఒంగోలు టౌన్‌: ప్రకాశం జిల్లా ఒంగోలులో పడకలు లేక కొవిడ్‌ రోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గత మూడు రోజులుగా జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనికి తోడు వ్యాధి సోకిన వారిలో 30 శాతం మంది బాధితులు ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒంగోలు సర్వజన ఆస్పత్రిలో గత రెండు రోజులుగా కొత్తగా చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండగా.. డిశ్చార్జ్‌ అవుతున్న వారి సంఖ్య మాత్రం తక్కువగా ఉంది. ఆస్పత్రిలో మొత్తం 1100 పడకలు ఉండగా.. వాటిలో 850 పడకలకు ఆక్సిజన్‌ సౌకర్యం ఉంది. అవన్నీ కొవిడ్‌ బాధితులతో నిండిపోయాయి. అత్యవసర కేసులు వస్తే ఎవరైనా డిశ్చార్జ్‌ అయితే చేర్చుకుంటామని చెబుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. వ్యాధి తీవ్రతతో ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉన్నవారికి ఆక్సిజన్‌ అందించి ఓపీ వద్ద నేలపైనే పడుకోబెడుతున్నారు.

సమస్యలు ఉన్నమాట నిజమే: ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా.డి.శ్రీరాములు
‘‘ఆస్పత్రిలో సమస్యలు ఉన్నమాట నిజమే. ఒక రోగి బంధువులు సొంతంగా ఆక్సిజన్‌ సిలిండర్‌ తీసుకుని రోగికి అమర్చారు. వ్యాధినుంచి కోలుకున్న వారిని గుర్తించి కొత్త వారికి పడకలు కేటాయిస్తాం. కేసులు పెరుగుతున్నందున మరో 1,100 పడకలు అవసరమవుతాయి. అత్యవసర కేసులకు ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాం. గైనకాలజీ విభాగాన్ని మాతాశిశు వైద్యశాలకు మార్చబోతున్నాం. ఈ ప్రక్రియ పూర్తయితే మరో 70 ఆక్సిజన్‌ పడకలు అందుబాటులోకి వస్తాయి’’ అని శ్రీరాములు వివరించారు.

స్పందించిన సీఎంవో..

ఒంగోలు జీజీహెచ్‌ వద్ద కొవిడ్‌ కేసుల తాకిడిపై సీఎంవో స్పందించింది. కరోనా కేసులు, ఓపీ కౌంటర్‌ వద్ద బాధితుల తాకిడిపై ఈటీవీలో వచ్చిన కథనంపై సీఎంవో ఆరా తీసింది. ఓపీ కౌంటర్‌ వద్దే అత్యవసర సేవలు అందించాలని ఆదేశించింది. ఆక్సిజన్ కంప్రెషర్స్‌, డి టైప్‌ సిలిండర్స్‌ అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. 

విజయవాడలో..
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్‌ రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆస్పత్రిలో పడకలు ఖాళీ లేక కరోనా బాధితులు నిరీక్షించాల్సి వస్తుంది. గంటల తరబడి అంబులెన్సుల్లోనే ఇబ్బంది పడుతూ పడిగాపులు కాస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స అందక నరకయాతన పడుతున్నారు. ఆస్పత్రిలోని శవాగారం వద్ద కొవిడ్‌ నిబంధనలు పూర్తిగా గాలికి వదిలేశారు. కొవిడ్‌తో చనిపోయిన వారి మృతదేహాలను కుటుంబసభ్యులు తీసుకువెళ్లడం లేదు. ఫలితంగా మృతదేహాలను ఆరుబయటే వదిలేశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని