‘దేవుడు వార్‌ జోన్‌లో పడేశాడు.. బీ అలర్ట్’ 

తాజా వార్తలు

Updated : 25/04/2021 12:45 IST

‘దేవుడు వార్‌ జోన్‌లో పడేశాడు.. బీ అలర్ట్’ 

మహేశ్‌ డైలాగ్‌లతో వీడియో పోస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్‌: దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. ఈ మహమ్మారి వ్యాప్తికి కళ్లెం వేసేందుకు అన్ని ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలుచేస్తున్నాయి. మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం సహా కొవిడ్‌ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాస్క్‌ ధరించడంపై తెలంగాణ పోలీసులు వినూత్న ప్రచారం చేస్తున్నారు. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు మాస్క్‌ ధరించి ఉన్న ఓ ఫొటోతో ప్రత్యేక వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. తద్వారా మాస్క్‌ ప్రాధాన్యతను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ‘‘జీవితమనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్‌జోన్‌లో పడేశాడు. అప్రమత్తంగా ఉండండి.. మిమ్మల్ని మీరు రక్షించుకోండి’’ అంటూ ఈ వీడియోలో మహేశ్ డైలాగ్‌లు ఆలోచింపజేసేలా ఉన్నాయి. 

మాస్క్‌ పెట్టుకోమ్మా.. ఆరోగ్యానికి మంచిది!: హోంమంత్రి

బెంగళూరు: కరోనా ఉగ్రరూపం కొనసాగుతున్న వేళ కర్ణాటకలో వీకెండ్‌ లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ లాక్‌డౌన్‌ ఎలా అమలుజరుగుతుందో రాష్ట్ర హోంమంత్రి బీఎస్‌ బొమ్మై శనివారం స్వయంగా పరిశీలించారు. అధికారులతో కలిసి ఆయన కేఆర్‌ మార్కెట్‌ వద్ద తనిఖీలు నిర్వహించగా.. మాస్క్‌లేకుండా ఉన్న ఓ మహిళ ఆయనకు కనిపించింది. దీంతో వెంటనే ఆమెను దగ్గరకు పిలిచి ఓ మాస్క్‌ను ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా ‘మాస్క్‌ పెట్టుకోమ్మా.. ఇది ఈ ఆరోగ్యానికి మంచిది’ అని సూచించారు. 

ఫ్రీ టీకా జాబితాలో మరో మూడు రాష్ట్రాలు
మే 1నుంచి దేశ వ్యాప్తంగా 18 ఏళ్ల పైబడిన వారికి ఉచితంగా టీకా పంపిణీ చేసిన జాబితాలో ఈ రోజు మరో మూడు రాష్ట్రాలు చేరాయి. తెలంగాణతో పాటు హరియాణా, జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వాలు సైతం ఉచితంగా టీకా అందించనున్నట్టు వెల్లడించాయి. ఇప్పటికే ఏపీ, కేరళ సహా పలు రాష్ట్రాలు ఉచితంగా టీకా పంపిణీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. 

గుజరాత్‌ డిప్యూటీ సీఎంకు కరోనా
గుజరాత్‌ ఉపముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ కరోనా బారినపడ్డారు. వైరస్‌ సోకడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు.  కరోనా లక్షణాలు ఉండటంతో  ఆర్టీ పీసీఆర్‌ పరీక్ష చేయించుకున్నట్టు ఆయన తెలిపారు. పాజిటివ్‌గా తేలడంతో వైద్య చికిత్సల కోసం మెహతా ఆస్పత్రిలో చేరినట్టు తెలిపారు. తనను కలిసిన వారంతా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కొత్త కేసులు: యూపీలో 38వేలు.. కేరళలో 26వేలు
దేశంలో కరోనా వైరస్‌ పట్టపగ్గాల్లేకుండా వ్యాపిస్తోంది. రోజురోజుకీ కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. యూపీలో తాజాగా 38,055 కొత్త కేసులు, 223 మరణాలు నమోదయ్యాయి. గడచిన 24గంటల వ్యవధిలో 23231 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తాజా గణాంకాల ప్రకారం ఇప్పటివరకు కొవిడ్‌ బారిన పడి 10,959మంది ప్రాణాలు కోల్పోగా.. 7,52,211మంది కోలుకున్నారు. ప్రస్తుతం 2,88,144 క్రియాశీల కేసులు ఉన్నాయి. అలాగే, కేరళలో తాజాగా మరో 26,685 కొత్త కేసులు, 25 మరణాలు నమోదయ్యాయి. తాజా గణాంకాలతో మొత్తం మరణాల సంఖ్య 5080కి చేరగా.. కేరళలో ప్రస్తుతం 1,98,576 క్రియాశీల కేసులు ఉన్నాయి. 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని