TS: నేడు, రేపు వ్యాక్సినేషన్‌ నిలిపివేత
close

తాజా వార్తలు

Updated : 15/05/2021 02:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS: నేడు, రేపు వ్యాక్సినేషన్‌ నిలిపివేత

హైదరాబాద్‌: కొవిషీల్డ్‌ తొలి, రెండో డోస్‌ మధ్య వ్యవధిలో కేంద్రం ప్రభుత్వం మార్పులు చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న కొవిడ్ వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ని నేడు, రేపు, నిలిపివేస్తున్నట్లు తెలిపింది. కొవిషీల్డ్ టీకా మొదటి డోసు తీసుకున్న వారికి రెండో డోసు 12 నుంచి 16 వారాల వ్యవధిలో ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పెషల్‌ డ్రైవ్‌ని రద్దు చేసింది. ఈ నెల 17న తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపింది. కొవిషీల్డ్‌ టీకా తీసుకున్న వారికి మొదటి డోస్ తరువాత 12 వారాలు దాటకే రెండో డోస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు కొవిషీల్డ్‌ టీకా రెండో డోస్‌ను 6-8 వారాల తర్వాత  ఇచ్చారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల నేపథ్యంలో శని, ఆది వారాలు రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన డిహెచ్ జి.శ్రీనివాసరావు తెలిపారు. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని