Coronavaccine: ఏపీ వ్యాప్తంగా నిలిపివేత
close

తాజా వార్తలు

Updated : 10/05/2021 12:56 IST

Coronavaccine: ఏపీ వ్యాప్తంగా నిలిపివేత

అమరావతి: ఏపీ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఈరోజు పూర్తిగా నిలిచిపోయింది. కొవిడ్‌ టీకా పంపిణీ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పలు జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు. చిత్తూరు, విజయనగరం, కృష్ణా, నెల్లూరు, తూర్పుగోదావరి, కర్నూలు,  గుంటూరు, ప్రకాశం, కడప తదితర జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ ఆపేశారు. రాష్ట్రంలో 3.5లక్షల డోసులు అందుబాటులో ఉండగా.. రెండో డోసు వారికే టీకా వేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండటంతో ప్రక్రియను నిలిపివేశారు. 

మరోవైపు కొవిన్‌ యాప్‌లో రిజిస్ట్రేషన్‌ మార్పులపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొన్ని రోజులపాటు రెండో డోసు వారికే వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాల వద్ద రద్దీ తగ్గించేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.  కరోనా టీకాలు లేకపోవడంతోనే ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు వైద్యులు తెలిపారు.  ప్రక్రియ ఆపేసిన సంగతి ముందుగా తెలియకపోవడంతో ఈ ఉదయం నుంచీ వ్యాక్సిన్‌ కేంద్రాల వద్దకు చేరుకుని నిరీక్షిస్తున్నారు. ముందుగా సమాచారం తెలియకపోవడంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నిరాశతో అక్కడి నుంచి వెనుదిరుగుతున్నారు.

మూడు రకాలుగా టోకెన్ల పంపిణీ..

వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు అధికారులు కొత్త విధానం అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. కరోనా యోధులు, 60 ఏళ్లు దాటినవారు, 45 ఏళ్లు దాటిన వారిగా విభజిస్తున్నారు. మూడు రకాలుగా టోకెన్లు జారీ చేయనున్నారు. ఎవరికి ఎప్పుడు టీకా ఇస్తారనే వివరాలతో వారి ఇంటివద్దకే ఆశా కార్యకర్తల ద్వారా టోకెన్లు పంపిణీ చేయనున్నారు. టోకెన్ల పంపిణీ పూర్తయ్యాకే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రద్దీ నియంత్రణకే ఈ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని