తెలంగాణకు చేరిన 3లక్షల టీకా డోసులు
close

తాజా వార్తలు

Published : 29/04/2021 13:57 IST

తెలంగాణకు చేరిన 3లక్షల టీకా డోసులు

హైదరాబాద్‌: వ్యాక్సిన్ల కొరతతో జనం అవస్థలు పడుతున్న నేపథ్యంలో తెలంగాణకు 3లక్షల కొవిషీల్డ్‌  టీకా డోసులు చేరుకున్నాయి. పుణె నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఈ వ్యాక్సిన్‌ను కోఠిలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలిస్తున్నారు. టీకా కోసం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నవారి వివరాల వారీగా ఆయా జిల్లాలకు ఇక్కడి నుంచి టీకా పంపిణీ చేయనున్నారు.

టీకా కొరత వేధిస్తుండటంతో ఈ రోజు అనేకమంది టీకా కేంద్రాలకు వచ్చి వెనుదిరగాల్సిన పరిస్థితులు తలెత్తాయి. మరికొన్ని చోట్ల వాగ్వాదాలు జరిగాయి. ప్రభుత్వం రోజూ లక్ష నుంచి లక్షన్నర వరకూ టీకాలు వేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్న నేపథ్యంలో ఈ రోజు వచ్చిన టీకా డోసులు కేవలం రెండు రోజులకు మాత్రమే సరిపోయే అవకాశం ఉంది. మరి మే 1 నుంచి 18ఏళ్లు పైబడిన వారికి టీకా వేయించుకోవాలంటూ కేంద్రం ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో టీకా సరిపడా లేకపోవడంతో ఇబ్బందులు నెలకొన్నాయి. రాష్ట్రానికి ఇప్పటికే 46.53లక్షల డోసులు పంపగా.. ఇప్పటికే 45,36641 డోసులు వినియోగించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని