ఎక్కువ ఛార్జ్‌ చేస్తే కఠిన చర్యలు: సీపీ సజ్జనార్‌
close

తాజా వార్తలు

Published : 24/04/2021 17:39 IST

ఎక్కువ ఛార్జ్‌ చేస్తే కఠిన చర్యలు: సీపీ సజ్జనార్‌

హైదరాబాద్‌: నగరంలో అంబులెన్సుల నిర్వాహకులు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌  హెచ్చరించారు. హైదరాబాద్‌ నగరంలో అందుబాటులోకి తీసుకొచ్చిన ఎనిమిది అంబులెన్సులను సీపీ సజ్జనార్‌ ఇవాళ ప్రారంభించారు. సోమవారం నుంచి మరో నాలుగు అంబులెన్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఐటీ సంస్థల సహకారంతో అంబులెన్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటిని ఇన్‌స్పెక్టర్‌ ర్యాంక్‌ అధికారి పర్యవేక్షిస్తారని తెలిపారు. డయాలసిస్‌, కొవిడ్ బాధితులు, గర్భిణులు, అత్యవసర సేవలకు ఈ అంబులెన్సులు అందుబాటులో ఉంటాయన్నారు. అంబులెన్సుల సాయం కోసం 9490-617-431, 9490-617-440 నంబర్లను సంప్రదించాలని సీపీ సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని