జవాను మురళీకృష్ణకు నివాళులర్పించిన సజ్జనార్‌

తాజా వార్తలు

Published : 06/04/2021 01:07 IST

జవాను మురళీకృష్ణకు నివాళులర్పించిన సజ్జనార్‌

హైదరాబాద్‌: అమరజవాన్‌ శాఖమూరి మురళీకృష్ణ(32) పార్థివదేహం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరింది. ఛత్తీస్‌గఢ్‌లో భద్రతాబలగాలకు-మావోయిస్టులకు జరిగిన దాడిలో 22 మంది జవాన్లు అమరులు అయిన విషయం తెలిసిందే. మృతిచెందిన వారిలో విజయనగరం జిల్లాకు చెందిన జవాన్‌ జగదీష్‌(27), గుంటూరు జిల్లాకు చెందిన  శాఖమూరి మురళీకృష్ణ ఉన్నారు. మురళీకృష్ణ స్వస్థలం గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామం. మురళీకృష్ణ పార్థివదేహం వద్ద సీఆర్‌పీఎఫ్‌ అధికారులు, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సజ్జనార్‌ మాట్లాడుతూ.. ‘అమరజవాన్లకు తెలంగాణ పోలీస్‌ శాఖ నుంచి జోహార్లు. అమర జవాన్ల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. అమరజవాన్లను స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలి. మురళీకృష్ణ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని’ సజ్జనార్‌ అన్నారు. విమానాశ్రయం నుంచి ప్రత్యేక వాహనంలో మురళీకృష్ణ పార్థివదేహాన్ని స్వస్థలానికి అధికారులు తరలించారు. 

​​​​


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని