సీపీఎస్ కేసులు ఎత్తివేసిన ఏపీ ప్రభుత్వం
close

తాజా వార్తలు

Published : 30/07/2020 21:18 IST

సీపీఎస్ కేసులు ఎత్తివేసిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: కంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం(సీపీఎస్‌) రద్దు ఉద్యమ కేసుల నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విముక్తి కల్పించింది. ఉద్యమం సమయంలో వారిపై నమోదైన కేసులను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖను ప్రభుత్వం ఆదేశించింది. సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ గతంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనలు చేశారు. ఈ క్రమంలో కొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ కేసులనే ప్రభుత్వం తాజాగా ఎత్తివేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని