Curfew: ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు
close

తాజా వార్తలు

Updated : 31/05/2021 16:59 IST

Curfew: ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు

అమరావతి: కరోనా పరిస్థితుల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూను పొడిగించింది. ఇప్పటికే విధించిన కర్ఫ్యూ గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ సహా పలువురు ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. అనంతరం జూన్‌ 10 వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న సడలింపు సమయం యథావిధిగా కొనసాగనుంది.

కొవిడ్ విజృంభ‌ణ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఈనెల 5న ప‌గ‌టి కర్ఫ్యూని అమ‌ల్లోకి తీసుకొచ్చింది. 18వ తేదీ వ‌ర‌కూ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని తెలిపింది. ఆ త‌ర్వాత కూడా క‌రోనా కేసుల్లో త‌గ్గుద‌ల న‌మోదు కాక‌పోవ‌డంతో ఈ నెలాఖ‌రుకు వ‌ర‌కూ పొడిగించిన విషయం తెలిసిందే. ఆ గ‌డువు ఇవాళ్టితో ముగియ‌డంతో స‌మీక్ష నిర్ణ‌యించిన సీఎం జూన్ 10 వ‌ర‌కూ క‌ర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. కాగా.. ఏపీలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లను అనుమతిస్తున్నారు. ఆ సమయంలోనూ 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని