Curfew: తెలంగాణలో రోడ్లు నిర్మానుష్యం
close

తాజా వార్తలు

Updated : 20/04/2021 22:10 IST

Curfew: తెలంగాణలో రోడ్లు నిర్మానుష్యం

హైదరాబాద్‌: కరోనా తీవత్రతో రాష్ట్ర ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూ తెలంగాణలో అమల్లోకి వచ్చింది. నేటి రాత్రి నుంచి కర్ఫ్యూ విధించడంతో హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దుకాణాలన్నీ రాత్రి 8గంటలకే మూసివేశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో కర్ఫ్యూ నిబంధనలు పాటిస్తూ షాపింగ్, దుకాణాలను మూసివేశారు. పంజాగుట్టలోని హైదరాబాద్ సెంట్రల్‌‌, బంజారాహిల్స్‌ సిటీ సెంటర్, జీవీకే మాల్‌, సినీమాక్స్‌ మూతపడ్డాయి. సినిమా థియేటర్లు, పబ్‌లు, బార్లు, మద్యం దుకాణాలను కూడా రాత్రి 8గంటలకే మూసివేయించారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. కర్ఫ్యూ అమల్లోకి రావడంతో హైదరాబాద్‌ సహా రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు నిర్మానుష్యంగా మారాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని